కరోనా పేషెంట్ల లో ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తోంది. కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది. అయితే డాక్టర్లు కొందరి కరోనా పేషెంట్ల లో మ్యూకర్మైకోసిస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్లలో ఒక ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని.. దీని వల్ల ఎంతో సైలెంట్ గా ప్రమాదం వస్తుందని చెప్పారు.
గత మూడు నాలుగు వారాల్లో ఈ ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ తో ఐదుగురు పేషెంట్లు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. మ్యుకర్మైకోసెస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్లలో అవయవాలు కూడా దెబ్బతింటున్నట్లు గుర్తించారు.
కళ్ళు ఉబ్బిపోవడం, కళ్ళు నొప్పులు, ముక్కులో నుంచి రక్తం కారడం ఇలా మ్యూకస్మైకుసెస్ ఇతర లక్షణాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అటువంటి పేషెంట్లకు యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఇస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు.
నచ్చినవి, ఎవరు ప్రిస్క్రైబ్ చెయ్యని యాంటి బయాటిక్స్ మరియు సెరోయిడ్స్ ను ఉపయోగించడం మంచిది కాదని ఇబ్బందికి తీసుకు వస్తానని చెప్పారు. జ్వరం, జలుబు, దగ్గు ఉన్న కూడా మీకు నచ్చినట్లు మందులు వాడద్దని ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పారు. భారత దేశంలో మ్యుకర్మైకోసెస్ కేసులు 40 ఉన్నాయి ఆ నలభై మందిలో 8 మంది కంటి చూపును కోల్పోయారు.