ఎమ్మెల్యే రమేష్ బాబు టెర్రరిస్ట్ కాదు… బోయినపల్లి వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Join Our Community
follow manalokam on social media

వేములవాడ ఎమ్మెల్యే గా తాను పోటీ చేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని ఇదంతా పుకార్లేనని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్  వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వం కేసు కోర్టులో ఉందని దాని పైన కొందరు నానా రకాలుగా మాట్లాడుతున్నారని పౌరసత్వ వివాదం కోర్టు తేలుస్తుందన్నారు.

చెన్నమనేని కుటుంబం మొదటి నుంచి ప్రజాసేవలో ముందుండి ప్రజల పక్షాన నిలిచిన కుటుంబమని ప్రజాసేవలో ముందుండే చెన్నమనేని కుటుంబం పై దిగజారు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పై ప్రతిపక్ష నాయకులు కొందరు దిగజారి విమర్శించడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు టెర్రరిస్ట్ కాదు, బ్యాంకు దోపిడీదారు కాదు,  ప్రజల మనిషి అని తెలిపారు,గులాబీ జెండా పార్టీ ప్రారంభించిన నాటి నుండి పని చేస్తున్నందున ఈ వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందని అన్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...