గుండె సంబంధిత సమస్యతో హాస్పిటల్లో చేరిన బాలీవుడ్ నటి

-

బాలీవుడ్ డ్యాన్సర్, మోడల్, బోల్డ్ నటి రాఖీ సావంత్ ఆస్పత్రి పాలైంది. రాఖీ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్పైన సెలైన్ పెట్టినట్టు కనిపిస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమెకు ఏమైందా అని నెటిజన్లు, ఆమె అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. అయితే ఆమె గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటూ బీ టౌన్‌ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

రాఖీ ఆరోగ్యం బాగానే ఉందని, పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్టుగా హిందీ మీడియా కథనాలు వెల్లడించాయి. హిందీ పాపరాజీ వైరల్ భయానీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాఖీ సావంత్ ఆస్పత్రి బెడ్పై ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అయితే రాఖీ సావంత్ ఇన్స్టాలో మాత్రం కొన్ని గంట క్రితం కూడా ఫన్నీ రీల్‌ను షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. అసలు రాఖీ నిజంగానే ఆస్పత్రిలో చేరిందా అని కొందరు అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఈ న్యూస్పై రాఖీ క్లారిటీ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news