కుటుంబంలో 8మందిని చంపిన యజమాని.. ఆపై తాను కూడా..?

-

మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. ఆపై అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఈ కుటుంబం గురించి చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. అయితే బోదల్ కఛార్ గ్రామానికి చెందిన ఆ వ్యక్తికి మానసిక సమస్యలున్నాయని స్థానికులు పోలీసులతో చెప్పారు. ఆ కారణంగానే కుటుంబ సభ్యులను హత్య చేసి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. మరణించిన వారిలో హత్య చేసిన వ్యక్తి తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా వివరాలు తెలుసుకుని వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news