త్వరలో కోహ్లీ బయోపిక్…!

-

బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాలు ఇప్పటికే వెండితెరను పలకరించాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ,బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అదేవిధంగా 1983 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఇప్పుడు మరో బయోపిక్ కి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Cricket – England v India – Second Test – Lord’s, London, Britain – August 12, 2018 India’s Virat Kohli reacts before receiving treatment from medical staff for a back injury Action Images via Reuters/Paul Childs

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ట్ విరాట్ కోహ్లీ జీవితకథ ఆధారంగా ఒక సినిమాను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారట. కరణ్ జోహార్ నిర్మాతగా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు ఎవరు అనేది స్పష్టత లేకపోయినా ఈ సినిమాని జూలై నుంచి సెట్స్ మీదకు తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కరణ్ జోహార్ ఇప్పటికే విరాట్ కోహ్లీ ని కలిసి ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది స్పష్టత లేకపోయినా షాహిద్ కపూర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అనుష్క శర్మ పాత్రలో అనుష్క శర్మ నటిస్తుందని లేకపోతే కైరా అద్వానీ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ ప్రధానంగా ఈ సినిమాలో వీరి లవ్ స్టోరీ కూడా చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట నిర్మాత కరణ్ జోహార్. దర్శకుడు ఎవరు అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news