బాలీవుడ్ హీరోయిన్లు ఆర్థికంగా సర్వం కోల్పోయారట..దీపికా పదుకోన్ ,జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉపాధి హామీ పనికి వెళ్తున్నారట..వినడానికి ప్రపంచ వింతగా ఉన్నా మన అధికారుల వింతలో సృష్టించడంతో అందెవేసిన చేయి కాదా..తాజాగా మధ్యప్రదేశ్‌లో జాతీయ ఉపాధి హామీ పథకంలో దీపికా పేరుమీద జాబ్ కార్డు సృష్టించారు..ఒక్క దీపికా మాత్రమే కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఉపాధిహామీ పనికి వెళ్తుందట.
దీపికా పదుకోన్ బాలీవుడ్ టాప్ హీరోయిన్. తక్కువలో తక్కువ ఒక్క సినిమాకు దాదాపుగా 29కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సినిమాలే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల ద్వారా, బ్రాండింగ్స్‌తో ఆదాయం రానే వస్తుంది. ఏడాదికి వందల కోట్లకుపైగా సంపాదిస్తుంది. అంత ఆదాయం వచ్చిన ఆమె మాత్రం ఉపాధి హామీ పనికి వెళ్తుందట.
జిర్న్యా జిల్లా పిపర్‌ఖేడా నకా పంచాయితీలో సర్పంచ్, కార్యదర్శి ఉపాధి హామీ పథకంలో చేతివాటం ప్రదర్శించారు. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పడుకోన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేర్లతో ఫేక్ జాబ్‌కార్డులు సృష్టించారు. వారి ఖాతాల నుంచి డబ్బు తీసుకునేందుకు నకిలీ జాబ్ కార్డులను ఉపయోగించారు..దీపిక, జాక్వెలిన్ ఉపాది హామీ పనికి వెళ్లినట్లు నమోదు చేసి, వచ్చిన డబ్బులను తీసుకుంటున్నట్లు గుర్తించారు.