బాలీవుడ్ కాదు.. టాలీవుడ్ నెంబర్ వన్.. కంగనా కామెంట్..?

గత కొన్ని రోజుల బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులందరిని టార్గెట్ చేస్తూ ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ మధ్యకాలంలో పొలిటికల్ గా కూడా ఓ వివాదాన్ని తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ పలు కామెంట్స్ చేసి మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది కంగనారనౌత్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా లో అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మిస్తానని నిర్ణయం తీసుకోవడంపై స్పందించిన కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇండియాలో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అతి పెద్దది అని అందరూ అనుకుంటారని కానీ… వాస్తవానికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అన్ని ఇండస్ట్రీల్లో కెల్లా అగ్ర స్థానాన్ని ఎప్పుడో ఆక్రమించుకుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కంగనా. తరచూ తెలుగు చిత్ర పరిశ్రమ పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూ ఏకంగా మంచి విజయాలను కూడా అందుకుంటుందని తెలిపింది. యూపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని.. అన్ని ఇండస్ట్రీ లను కలిపి భారతీయ చిత్ర పరిశ్రమ గా మార్పులు తీసుకు వస్తే బాగుంటుంది అంటూ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.