భారత్ గొప్ప రికార్డు.. మనమే నెంబర్ వన్..?

భారత దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నమోదు అవుతున్న విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టిన రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కానీ అదే సమయంలో భారత్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక రికవరీ రేటులో ప్రపంచ దేశాల్లోనే సరికొత్త రికార్డును సాధించింది భారత్. ప్రస్తుతం ఈ రికార్డు దేశ ప్రజలందరిలో సరికొత్త ధైర్యాన్ని నింపుతుంది.

కరోనా బాధితుల రికవరీ విషయంలో ఏకంగా మొదటి స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కి నెట్టి.. అగ్రస్థానంలో నిలిచింది భారత్. భారత్లో ఇప్పటివరకు 42 లక్షల మందికిపైగా కరోనా వైరస్ భారీ నుండి కోరుకున్నారు. కాగా ఇప్పుడు వరకు అమెరికాలో 41 లక్షల మంది మాత్రమే కరోనా వైరస్ నుంచి కోలుకోవడం గమనార్హం. దీంతో ఎక్కువమంది రికవరీ అయిన దేశంగా భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్లో రికవరీ రేటు 79.28 శాతంగా ఉండగా.. భారత ప్రభుత్వం ఊహలతోనే ఇది సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.