రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యాపారంలో శిల్పాశెట్టి ప్రమేయం ఉందా అన్న విషయంలో ప్రాథమికంగా అలాంటిదేమీ లేదని తెలిసినప్పటికీ విచారణ కొనసాగిస్తున్నారు. ఐతే తాజాగా బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ శిల్పాశెట్టికి మద్దతు ఇచ్చాడు. హంగామా 2 సినిమాకి నిర్మాతగా పనిచేసిన రతన్ జైన్ తో కలిసి హత్యార్, ధడ్కన్ వంటి సినిమాల్లో శిల్పాశెట్టి నటించింది.

ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన రతన్ జైన్, నాకు తెలిసి శిల్పాశెట్టికి తన భర్తపై ఆరోపణలు వచ్చిన వ్యాపారంతో ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కుటుంబ జీవనం గడిపే మహిళలు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి ఇష్టపడరు. శిల్పాశెట్టి గురించి తెలిసిననందువల్ల తను ఈ పనిలో భాగస్వామి అయి ఉండదని అనుకుంటున్నానని అన్నాడు.