Malaika Arora: మద్యం మైకంలో అర్జున్ క‌పూర్ .. ముద్దుల‌తో ముంచెత్తిన మలైక.. నెట్టింట్లో ఫోటోలు వైర‌ల్

-

Malaika Arora: బాలీవుడ్‌లో ల‌వ్ స్టోరీల‌కు కొద‌వేలేదు. అందులో కాస్త.. హాట్ అండ్ ఢిపిరేట్ ల‌వ్ స్టోరీ.. ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీకి దగ్గరైన మలైకా అరోరా, థర్టీ ప్లస్ లో ఉన్న అర్జున్ కపూర్ ల‌ది.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న త‌ర్వ‌త మలైకా అరోరా మ‌రింత‌ రెచ్చిపోయింది. ఆ త‌రువాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమ మైకంలో మునిగి తేలుతుంది. చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అస‌లు కొడుకు వ‌య‌స్సు ఉన్న అర్జున్ క‌పూర్ తో రొమాన్స్ ఏంటని విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన ఏ మాత్రం లెక్క చేయ‌లేదు ఈ ప్రేమ జంట.

ఐటెం బ్యూటీగా బాలీవుడ్ తెరపై మ‌లైకా చేసిన రచ్చ మామూలుగా లేదు. దిల్ సే చిత్రంలోని ‘చెయ్య చెయ్య.. చెయ్యా.. అంటూ స్టెపులేసినా.. తాజాగా దబాంగ్ సినిమాలోని… మున్నీ బద్నాం హుయీ.. అంటూ దుమ్ము రేపినా.. ఆమెకే చెల్లింది. ఇటు టాలీవుడ్ లోనూ తన అందాల రుచి చూపించింది. అతిథి, గబ్బర్ సింగ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ను రెచ్చకొట్టింది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల మలైకా, అర్జున్ కపూర్ పిక్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే..
ఇటీవ‌ల‌ మలైక పుట్టిన రోజు వేడుక‌ల‌ను అర్జున్ కపూర్ గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఈ వేడుక‌ల్లో కరీన కపూర్ కూడా పాల్గొన్న‌ట్టు తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో మద్యం సీసాలు, చేతిలో మందు గ్లాసులు తో హాట్ ల‌వ్ బ‌ర్డ్స్ క‌నిపిస్తున్నారు.

అలా మద్యం మైకంలో ఉన్న అర్జున్ క‌పూర్ ను మ‌లైకా ముద్దుల‌తో ముంచెత్తినట్టు క‌నిపిస్తుంది. ప్రతీ రోజూ నవ్విస్తూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాన‌నీ, ఈ ఏడాది త‌న‌ జీవితంలో మరింత నవ్వులు రావాలని కోరుకున్నాడు అర్జున్ క‌పూర్. ఈ ఫోటోను క‌రీనా క‌పూర్ పోస్టు చేసిన‌ట్టు తెలుస్తుంది. వీరంతా ఒకే చోట ఉన్నారని తెలిసిపోతోంది. అయితే ఈ ఫోటోలో మాత్రం అర్జున్ కపూర్, మలైక అరోరా మంచి ఫాంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక మలైకా పర్సనల్ లైఫ్ కు వ‌స్తే.. మ‌లైకా ఆరోరా.. 1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. కానీ 2017లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. వీరిద్ద‌రికి టీనేజ్ సన్ అర్హన్ ఖాన్ ఉన్నాడు. అత‌డు మ‌లైకా ఆరోరా సంరక్షణలోనే పెరుగుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news