బ్రేకింగ్ : కాబూల్ లో భారీ బాంబు పేలుడు, 14 మంది మృతి

-

ఆఫ్గనిస్థాన్ దేశ రాజధాని కాబూల్ లో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ బాంబు పేలుడు లో ఏకంగా 14 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. అంతే కాదు… వందలాది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాబూల్ లోని ఓ ప్రముఖ మసీద్ లో ఈ బాంబు పేలుళ్లు జరిగినట్లు తాలిబాన్లు ప్రకటించారు.

ఇప్పటికే పలు సార్లు కాబూల్లో బాంబు పేలుడు జరగగా.. ఈ సారి జరిగిన బాంబ్ పేలుడు లో మాత్రం ఏకంగా 14 మంది మృతి చెందడం… స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక ఈ ఘటన విషయం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ బాంబు పేలుడు ఎవరు చేశారనే దానిపై… ఇంకా క్లారిటి రాలేదు.

కాగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రస్తుతం… రాజ్యాంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వాన్ని దౌర్జన్యం గాల్లో పరుచుకున్న తాలిబన్లు… కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి… ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి చావులతో అలమటిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news