ప్రేమలో పడడం మన చేతిలో వున్నా.. అది సక్సెస్ అవుతుందా..ఫెయిల్యూర్ అవుతుందా అనేది మన చేతుల్లో ఉండదు. అయితే చాలా మంది ప్రేమలో ఓడిపోతే జీవితంలో కూడా ఓడిపోయాను అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా జీవితంలో ప్రేమ అనేది ఒక చిన్న భాగం మాత్రమే. ప్రేమే జీవితం అనుకుని జీవితాన్ని నాశనం చేసుకోవడం మంచిది కాదు.
చాలా మంది చేసే తప్పు ఇది. కనుక ప్రేమలో ఓడిపోయానని కుంగిపోవడం… ముందున్న మంచి భవిష్యత్తుని నాశనం చేసుకోవడం మంచి పని కాదు. అయితే ప్రేమలో నుండి బయటపడరా అని చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. అలా చెప్పడం చాలా సులభం. కానీ ఓడిపోయిన ప్రేమ నుండి బయటపడడం నిజంగా ఒక సమరం. అయితే ఆ ప్రేమ నుండి మిమ్మల్ని మీరు కాస్త డైవర్ట్ చేసుకుంటే తప్పకుండా ఆ ప్రేమ నుండి మీరు బయట పడచ్చు. లేదు అంటే మీ జీవితం కూడా నాశనమైపోతుంది అని నమ్మండి.
నిజాన్ని నమ్మండి:
చాలా మంది తిరిగి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారని.. వాళ్లతో మళ్లీ ఆనందంగా ఉండచ్చు అని భ్రమలో ఉంటారు. కానీ అది అయిపోయింది నేను మరోక దారిన చూసుకోవాలి అని దాని నుండి మీరు బయట పడాలి. ఒకసారి మీరు అది అయిపోయింది అనుకుంటే కచ్చితంగా దాని నుండి బయట పడవచ్చు. తప్పకుండా అది మీ చేతుల్లో ఉంటుందని తెలుసుకోండి.
మీ సపోర్ట్ ని మీరు గ్రహించండి:
మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు నిజంగా మీ కోసం ఏమైనా చేస్తారు. మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికి వాళ్ళు ఎంతటి కష్టాన్నయినా భరిస్తారు. అటువంటి వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకోండి వాళ్ల కోసం మీరు ఆనందంగా ఉండండి. వాళ్ల కోసం మీరు అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకునే ట్రై చెయ్యండి.
ఏదైనా ఒక మంచి ట్రిప్ వెయ్యండి:
ప్రయాణం చేయడం వల్ల కొత్త ప్రదేశాలు చూసి ఆనందించడం వల్ల బాధ తొలగిపోతుంది. కాబట్టి ఇది కూడా మీకు మంచిగా ఉపయోగపడుతుంది.
మీకు నచ్చిన వాటి పై ఫోకస్ పెట్టండి:
మీకు ఇష్టమైన వాటిపై దృష్టి పెడితే తప్పకుండా దీని నుండి మీరు బయటపడొచ్చు మ్యూజిక్ డాన్స్ ఇలా ఎవరికి నచ్చిన హాబీస్ వాళ్ళకి ఉంటాయి. అటువంటివాటిలో మీరు దిట్ట అవ్వగలరు. కాబట్టి వాటిపై మీరు సమయాన్ని కేటాయించండి.
మరొకరితో ప్రేమలో పడటం:
ఓడిపోయిన ప్రేమ నుండి మీరు మళ్ళీ ప్రేమ ద్వారా దాని నుండి బయట పడవచ్చు. కుటుంబ సభ్యులు చెప్పిన ఆమెను వివాహం చేసుకోవడం లేదా ఈసారి మంచి జీవిత భాగస్వామి వెతుక్కోవడం చేయడం ద్వారా కూడా మీరు బయటపడొచ్చు. అయితే గతంలో చేసిన తప్పులు చేయకుండా జరిగిన పొరపాట్లు మరొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే ఈసారి సక్సెస్ అవ్వచ్చు. అంతే కానీ మీ భవిష్యత్తుని మీరు మీ చేతులారా నాశనం చేసుకోవద్దు.