తమిళ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టారని, అతనికి ప్రాణానికి హాని ఉందని గుర్తు తెలియని ఓ వ్యక్తి పోలీసులకి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సాలగ్రామంలోని విజయ్ ఇంటికి బాంబు స్క్వాడ్‌తో చేరుకోని బాంబు కోసం గాలించారు. కానీ ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని కనిపెట్టి ఆరా తీశారు.
అయితే అతను మానసికంగా ఎదగలేని వ్యక్తి అని తెలియడంతో కుటుంబ సబ్యులకు పోలిసులు హెచ్చరిక జారీ చేసి మరొకసారి ఇలాంటి పనులు చేయకుండా చూసుకోవాలని చెప్పారు. గత నెల రజినీకాంత్ పో గార్డెన్ రెసిడెన్స్ లో కూడా బాంబు పెట్టారని ఒక వ్యక్తి ఇదే తరహాలో పోలీసులకు ఫోన్ చేసి ఆందోళన కలిగించాడు. అతనికి కూడా మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వలన అలా చేశాడని పోలీసులు కనుగొన్న విషయం తెలిసిందే.