పుణె గూగుల్​ ఆఫీస్​లో బాంబు కలకలం

-

మహారాష్ట్రలోని పుణెలో ఉన్న గూగుల్​ కార్యాలయంలో బాంబు కలకలం సృష్టించింది. ఆ బ్రాంచ్ ఆఫీసులో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అది ఫేక్​ అని తేలింది. అయితే ఈ బెదిరింపు కాల్​కు పాల్పడ్డ వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్​లో అరెస్ట్​ చేశారు.

ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​ ఉన్న గూగుల్​ ఆఫీస్​కు ఆదివారం ఓ వ్యక్తి కాల్​ చేశాడు. పుణె కోరేగావ్​ పార్క్​లో ఉన్న గూగుల్​ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు చెప్పాడు. వెంటనే ముంబయి పోలీసులకు కార్యాలయ సిబ్బంది సమాచారం అందించగా.. వారు అప్రమత్తమై పుణె పోలీసులను అలెర్ట్ చేశారు.

పుణె పోలీసులు వెంటనే గూగుల్ ఆఫీసుకు చేరుకుని బాంబు డిటెక్షన్ స్క్వాడ్​ సాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఎలాంటి బాంబు లేదని, అది బూటకపు కాల్​ అని నిర్ధరించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news