Bommarillu Bhaskar: అలుపు ఏరుగని పోరాటం తరువాత వచ్చే ప్రతిఫలం మామూలుగా ఉండదు. ఒక సారి విజయాన్ని వరించి చూడు అవకాశాలు వాటంతట అవే వచ్చి నీ గుమ్మన్నీ తడుతాయి. ఈ మాటలు సినీ ఇండస్ట్రీకి సరిగా సరిపోతాయి. ఒక్క హిట్ అయితే చాలు.. ఆఫర్లు క్యూ కడుతుంటాయి.
తాజాగా అలాంటి సక్సెస్‌నే ఎంజాయ్ చేస్తున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు, పరుగు చిత్రాలను తెరకెక్కించి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. కానీ.. ఆ తర్వాత పలు వరుస పరాజయాలను ముట్టా కట్టుకున్నాడు. ఇలా తన ఇమేజ్ క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో దిమ్మతిరిగే హిట్ కొట్టాడు. అక్కినేని యంగ్ హీరో అఖిల్, టాలీవుడ్ బుట్ట బోమ్మ పూజ హెగ్డేలతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. తనదైన మార్కును చూపించాడు.
ఈ విజయంతో తాజాగా ఆయనకు మెగా ఆఫర్ తన తలుపు తట్టింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించే అవకాశం వరించింది. ఈ ప్రాజెక్టు కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో ఇంట్రెస్టిక్ అంశమేమిటంటే.. ఈ సినిమాను మెగా హీరోతో చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ‘ఆహా’ ఓటిటి కోసం కూడా బొమ్మరిల్లు భాస్కర్ ఓ చిత్రానికి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ హిట్ ల తరువాత దాదాపు ఎనిమిదేండ్లకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో హీట్ కొట్టాడు డైరెక్టర్ భాస్కర్ . ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. ఎన్నో సీన్స్ రీషూట్ చేశారు. ఫైనల్ గా ఓ గ్రాండ్ విక్టరీని కైవసం చేసుకున్నారు.