నా కూతురు నిప్పు.. కాదంటే ?

-

శ్రీదేవి-బోనీ క‌పూర్ ల పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ ధ‌డ‌క్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు తొలి సినిమాతోనే అందులో హీరో ఇషాన్ క‌త్త‌ర్ తో ప్రేమ‌లో ప‌డింద‌ని కొన్నాళ్ల‌గా ప్ర‌చారంలో ఉంది. ఆ ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టు ఇద్ద‌రు ప్ర‌యివేటుగా మీడియాకు దొరికారు. ప‌బ్ ల్లో…పార్ట‌ల్లో…జిమ్ముల్లో క‌లిసి ఉన్న ఫోటోలు, వీడియోలు మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఇద్ద‌రు డేటింగ్ లో ఉన్నార‌ని చిల‌వ‌లు ఫ‌ల‌వులుగా క‌థ‌నాలొచ్చాయి. ఈ విష‌యంలోనే ఇషాన్ క‌త్త‌ర్ కి బ్ర‌ద‌ర్ షాహిద్ క‌పూర్ అప్పుడే ప్రేమ..తిర‌గ‌డాలు ఏండ‌ని క్లాస్ పీకిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

అయితే ఇవేవి అధికారికం కాదు. ఈ నేప‌థ్యంలో తాజాగా వ్య‌వ‌హారంపై జాన్వీ తండ్రి బోనీక‌పూర్ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. జాన్వీపై వచ్చిన‌వ‌న్నీ క‌ట్టు క‌థ‌నాలు. అందులో ఏ మాత్ర నిజం లేదు. ఇషాన్, జాన్వీ క‌లిసి న‌టించారు. వ్య‌క్తిగ‌తంగా స్నేహితులయ్యారు. బ‌య‌ట తిరిగారు. కానీ ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ లేదు. నా కూతురు గురించి బాగా తెలుసు. జాన్వీపై ఎంతో గౌర‌వంగా, నమ్మ‌కంతో ఉన్నానంటే కార‌ణం త‌న యాట్యుట్యూడే. శ్రీదేవి- నేను పిల్ల‌ల్ని ఎంతో పద్ద‌తిగా పెంచాం. ఇలాంటి రూమ‌ర్ల‌తో వీధిలోకి లాగొద్దంటూ బోనీ క‌పూర్ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు.

Boney Kapoor REACTS To Janhvi Kapoor's Dating Rumours
Boney Kapoor REACTS To Janhvi Kapoor’s Dating Rumours

జాన్వీ డ్రెస్సింగ్ సెన్స్ పై కూడా సోష‌ల్ మీడియాలో వస్తోన్న క‌థ‌నాల‌పైనా స్పందించారు. ఎవ‌రి అభియిష్టం మేర‌కు వాళ్లు న‌డుచుకుంటారు. ఇష్టాన్ని కాద‌నే అధికారం ఎవ‌రికీ లేదు. బిడ్డ‌లిద్ద‌రి విష‌యంలో ఎంతో స్వేచ్ఛ ఇచ్చాను. ఇలా ఉండాలి? అలా ఉండాల‌ని ప‌రిమితులు పెట్ట‌లేదు. ఎలాగైనా ఉండొచ్చు. కానీ అది హ‌ద్దుల్లో ఉండాలి. సినిమా, మోడ‌లింగ్ రంగాల్లో డ్రెస్సింగ్ సెన్స్ గురించి ప‌ట్టుంచుకోవాల్సిన ప‌నిలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news