భళా ఇథియోపియా.. భళా.. 12 గంటల్లోనే 350 మిలియన్ల మొక్కలు నాటారు..!

-

జూలై 29వ తేదీన ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ఆ దేశ వ్యాప్తంగా 12 గంటల్లో 200 మిలియన్ల మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఇక ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు మొక్కలు నాటారు.

మనిషి చేస్తున్న అనేక తప్పిదాల వల్ల పర్యావరణం ఏ విధంగా ప్రభావితం అవుతుందో అందరికీ తెలిసిందే. దీంతోపాటు వాతావరణంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు దంచి కొడుతున్నాయి. అలాగే వేసవిలో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు చెట్లను నరికివేస్తుండడంతో అడవులు నాశనమవుతున్నాయి. మట్టిలో సారం పోతోంది. వరదలు, కరువు వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ నియంత్రించాలంటే.. అందుకు మొక్కలను పెంచడం ఒక్కటే మార్గం. సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మింది కాబట్టే ఇథియోపియా మొక్కలను నాటడంలో ప్రపంచ రికార్డు సాధించింది.

Ethiopians Planted 350 Million Trees In 12 Hours

జూలై 29వ తేదీన ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ఆ దేశ వ్యాప్తంగా 12 గంటల్లో 200 మిలియన్ల మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఇక ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు మొక్కలు నాటారు. అలా వారు 12 గంటల్లోనే అనుకున్నదానికన్నా ఎక్కువగానే మొక్కలు నాటారు. మొత్తం 350 మిలియన్ల మొక్కలను నాటినట్లు ఇథియోపియా ఐటీ మంత్రి డాక్టర్ గెతాహున్ మెకురియా తెలిపారు. దీంతో తక్కువ సమయంలోనే అత్యధిక మొక్కలు నాటిన దేశంగా ఇథియోపియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

అయితే ఇథియోపియాలో నిజనాకి గత కొన్నేళ్లుగా తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ దేశంలో ఈ సీజన్‌లో 4 బిలియన్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో మొదటి ప్రయత్నంగా తాజాగా 12 గంటల్లో దేశ వ్యాప్తంగా 350 మిలియన్ల మొక్కలు నాటారు. అయితే ఈ విషయంలో భారత్ గతంలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2016లో ఒక రోజులో దేశ వ్యాప్తంగా 50 మిలియన్ల మొక్కలు నాటారు. కానీ ఇప్పుడు ఇథియోపియా ఆ రికార్డును అధిగమించింది. మరి ఈ రికార్డును భారత్ మళ్లీ బీట్ చేస్తుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news