2999 కే మొత్తం థియేటర్ బుక్ చేసుకోండి..!

కరోనా వైరస్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లను తిరిగి తెరుచుకునేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సగం సీటింగ్ సామర్థ్యంతో మాత్రమే సినిమా థియేటర్ లు నిర్వహించాలని నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమా థియేటర్లకి ప్రేక్షకులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు వివిధ రకాలుగా ప్రకటిస్తున్నారు. ఇటీవలే ఐనాక్స్ సినిమా థియేటర్ యాజమాన్యం అందరికీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

సాధారణంగా అయితే సీట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంటాయి సినిమా థియేటర్ యాజమాన్యాలు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఒక థియేటర్ మొత్తం బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అదికూడా ఎక్కువ ధర అనుకునేరు కేవలం అందరికీ అందుబాటు ధరలో ఉండేవిధంగా 2999 రూపాయలకు థియేటర్ మొత్తం బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఒక వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.