జగన్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఏపీ ఉద్యోగుల సంఘం. మే 1న ఏపీ ఉద్యోగులు భారీ సభకు శ్రీకారం చుట్టారు. CPSను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ లోని కలెక్టర్ రేట్ ల ఎదుట ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించాయి.
ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రతినెల 1వ తేదీన జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మే 1వ తేదీన భారీ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
అటు ఏపీలోని వివిధ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది లేదా ఆ పోస్టుల్లో శాశ్వత నియామకాలు జరిగే వరకూ ఏది ముందైతే అంతవరకు వీరి ఒప్పందం పొడిగించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక సిఎస్ లు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.