మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి.. గట్టిగా అరవద్దు అంటూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఉద్యోగం కావాలా ఇష్యు కావాలా అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. యూపీహెచ్సీ సిబ్బంది సేవలను యధాతథంగా వినియోగించుకోవటంటూ మంత్రి బొత్సకు వినతిపత్రం సమర్పిచేందుకు ఉద్యోగ సంఘం నేతలు వచ్చారు. అయితే సమస్య వివరించే ప్రయత్నం చేసినా వారిని మంత్రి గట్టిగా వారించారు. మహిళా ఉద్యోగినిపై మంత్రి వేలు చూపిస్తూ నీ ఉద్యోగం ఉంటుంది.. అరవొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యులను కోల్పోయినా విధులు నిర్వర్తించామంటూ చెప్పేందుకు మహిళా ఉద్యోగిని ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే మంత్రి ఏమాత్రం పట్టించుకోకుండా వాహనం ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి తీరు పట్ల యూపీహెచ్ సీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం లో తమకు న్యాయం జరగదని.. ఇప్పటికే నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ యూపీహెచ్ సీ మహిళా ఉద్యోగిని ఆవేదన చేస్తున్నారు.