నీ తల్లిదండ్రులు ఇలాగే పెంచారా.. సాంప్ర‌దాయ‌మే లేదు ? అశోక్ గజపతిపై బొత్స ఫైర్‌

ఇవాళ ఉద‌యం రామ‌తీర్థం చోటు చేసుకున్న ఉద్రిక్త‌త నేప‌థ్యంలోనే.. అశోక్ గజపతి రాజుపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అశోక్ గజపతి రాజు లాంటి పెద్ద వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని… ఇదేనా ఆయన పెంపకం.. మీ తల్లిదండ్రులు ఇలాగే పెంచారా అని నిల‌దీశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఏనాడు ఇలాంటినీచమైన సాంప్రదాయాలు జరగలేదని.. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏ రోజు ఒక లెటర్ కూడా రాయలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏ రోజు తన విలువులు కాపాడు కోలేదని… కనీస సంస్కృతి, సాంప్రదాయ లేని వ్యక్తి అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. జిల్లా పరువు తీసిన వ్యక్తి అని.. మనం ఎవరం కూడా రాచరీక వ్యస్థలో లేము, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని చెప్పారు. ఆలయ శంకుస్థాపనకు పిలవడానికి వెళ్లిన ఈఓని, ప్రధాన అర్చకలను తిట్టారని.. ప్రతిదీ ప్రజలు చూస్తున్నారని గుర్తు చేశారు. రామతీర్ధ ఆలయాన్ని వైభవంగా, రెండో భద్రాద్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.