గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అందరినీ కలవరపెడుతున్న ప్రశ్న ఏమిటంటే… అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్ కి ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు జగన్ ను పిలవకపోవడం వెనుక కారణం ముండొచ్చు అని. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ విందుకు ఆహ్వానం లభించగా జగన్ కు ఎలాంటి పిలుపు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ ను ఎందుకు ఆహ్వానించలేదు అన్న విషయంపై ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా స్పందిస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు జగన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాతి కాబట్టే ఆయనను విందుకు ఆహ్వానించలేదని అన్నారు.
అయితే ఈ విషయంలో వైకాపా నేతలు ఇచ్చిన వివరణ మరోలా ఉంది. వీరందరిలో కి బొత్స సత్యనారాయణ చెప్పిన కారణం మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. జగన్ ను ఎందుకు ఎందుకు పిలవలేదు అన్న కారణానికి బొత్స చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే దేశంలో జగన్ చాలా బలమైన నేత అని.. జగన్ కంటే బలమైన నేత ఎవరూ లేరు కాబట్టి అంతటి ప్రభావవంతమైన జగన్ కు మోడీ భయపడి విందుకు ఆహ్వానించలేదు అన్నట్లు చెప్పారు. అయితే ఈ విషయం పై తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే విందుకు హాజరైన నేతలంతా జగన్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారు అని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను వైసీపీ నెంబర్ 2 విజయ్ సాయి రెడ్డి తీసుకున్నారట. బొత్స ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు విజయసాయి రెడ్డి బొత్స సత్యనారాయణ కు ఫోన్ చేసి విపరీతంగా తలంటేశాడు అని చెబుతున్నారు. మైకు ముందు ఉంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని… వెంటనే దీనికి సంబంధించిన వివరణ మళ్ళీ ఇవ్వాలని ఇంకా అతను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని విజయ్ సాయి రెడ్డి చెప్పినట్లు సమాచారం. అయినా బొత్స చెప్పిన మాటల ప్రకారం హైదరాబాద్ వెళ్లి జగన్ కేసీఆర్ ని కలుస్తాడు…. అంటే ఈ లెక్కన కేసీఆర్ ను కూడా జగన్ కన్నా తక్కువ స్థాయి నేత గా చెప్పుకోవాల్సిందేనా? ఇక విజయ్ సాయి రెడ్డి కోప్పడటం లో తప్పేమీ లేదు కదా.