స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే అయితే ఆమె సినిమాల్లోకి వచ్చిన దగ్గరనుంచి ఏవో ఒక కారణాలతో వార్తల్లో నిలుస్తూనే వస్తుంది. అయితే తాజాగా నాగచైతన్యతో విడాకులు దగ్గర నుంచి ఆమెకు మయాసైటిస్ వచ్చిన వరకు మన విషయాల్లో ఎంత బాధను అనుభవించానని తెలిపింది అయితే ఒకప్పుడు వీటన్నిటికీ ఎంతో బాధపడేదాన్ని కానీ ఇప్పుడు ప్రతి విషయానికి సమాధానం చెప్పడం నేర్చుకున్నాను అంటూ చెప్పుకొస్తుంది సమంత అలాగే తాజాగా ఒక నెటిజన్ అన్నమాటకు తనదైన రీతిలో గట్టి కౌంటర్ ఇచ్చేసింది ఈ హీరోయిన్.
సమంత పర్సనల్ లైఫ్ విషయంలో ఆరోగ్యం పరంగా ఇప్పటికే పలు సమస్యలు ఎదుర్కొంది.. అయితే అన్నిటిని తట్టుకొని ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతుంది.. ప్రస్తుతం సమంత నటించిన శకుంతల సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. అయితే ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు హంగామా నడుస్తుంది.. అయితే థియేటర్ల ముందు హీరోయిన్ల పోస్టర్లు చూసి ఒక నెటిజన్ చేసిన కామెంట్కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేసింది సమంత..
ప్రస్తుతం తమిళనాడులో నయనతార నటించిన ‘కనెక్ట్’ మూవీతో పాటు ప్రదర్శించబడుతుంది.. అలాగే ప్రస్తుతం చెన్నైలోని క్రోంపేటలో థియేటర్ కాంప్లెక్స్‌లో వరుసగా నయనతార, త్రిష, ఐశ్వర్య రాజేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. అయితే ఈ సినిమాలకు సంబంధించిన బ్యానర్లు అన్ని వరుసగా కనిపిస్తుండగా దానిమీద కేవలం హీరోయిన్ల ఫోటోలు మాత్రమే ఉన్నాయి అయితే ఈ విషయంపై స్పందించిన ఒక నెటిజన్ తమిళ సినిమా ఇలాంటి సీన్లు అసలు ఊహించలేము అని పోస్ట్ చేశాడు అయితే దీనిపై స్పందించిన వేరొక నెటిజన్ మహిళలు ఎదుగుతున్నారు అనగా మరొకరు మహిళలు ఎదిగేది పడిపోవడానికి అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు అయితే ఈ విషయం సమంతకు కోపం తెప్పించిందని చెప్పాలి దీనిపై స్పందించిన సమంత ‘బౌన్స్ బ్యాక్ కావడం మునుపటి కంటే మరింత స్వీట్‌గా ఉంటుంది మిత్రమా’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేసింది..