యవ్వనంగా ఉన్న వారిని వృద్ధులుగా మార్చి చూపించే ఫేస్‌యాప్‌కు ప్రస్తుతం ఎంతటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తుండడంతో ఈ యాప్‌కు చెందిన సర్వర్లు కూడా హ్యాంగ్ అవుతున్నాయి.
యవ్వనంగా ఉన్న వారిని వృద్ధులుగా మార్చి చూపించే ఫేస్‌యాప్‌కు ప్రస్తుతం ఎంతటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తుండడంతో ఈ యాప్‌కు చెందిన సర్వర్లు కూడా హ్యాంగ్ అవుతున్నాయి. అంతటి భారీ ట్రాఫిక్ ఈ యాప్‌కు వస్తోంది. అయితే దీని వల్ల ఎంతో నష్టం కలుగుతుందని కొందరు చెబుతున్నప్పటికీ.. ఈ యాప్ మాత్రం ఒక కుటుంబాన్ని కలపడానికి ఉపయోగపడింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
చైనాలోని షెన్ జెన్ ప్రావిన్స్‌లో 18 ఏళ్ల క్రితం ఓ భవన నిర్మాణ కార్మికుడి కొడుకు తప్పిపోయాడు. అప్పుడు ఆ బాలుడి వయస్సు 3 ఏళ్లు మాత్రమే. తన కుమారుడు తప్పిపోయాడని అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వెతికినా.. ఆ బాలుడి జాడ తెలియలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వారు తమ కొడుకుపై ఆశలు వదులుకున్నారు.
అయితే తాజాగా ఫేస్‌యాప్‌ను ఉపయోగించిన పోలీసులు ఆ బాలుడికి చెందిన 3 ఏళ్ల వయస్సున్న ఫోటోను అందులోకి అప్‌లోడ్ చేసి ప్రస్తుతం అతను ఎలా ఉన్నాడో తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఫొటో ద్వారా పోలీసులు విచారించగా ప్రస్తుతం ఆ యువకుడిగా ఉన్న ఒకప్పటి బాలుడు వారికి దొరికాడు. ఈ క్రమంలో అతని డీఎన్ఏను తల్లిదండ్రుల డీఎన్ఏలు పోల్చి చూడా ఒక్కటేనని తేలింది. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అలా ఫేస్‌యాప్ ఒక కుటుంబాన్ని మళ్లీ కలిపింది..!