లాక్‌డౌన్ లో శ్రీశ్రీ బొమ్మని అచ్చు గుద్దినట్టు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు హాస్య నటుడు బ్రహ్మానందం. ఇక తాజాగా అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా ఆంజనేయుని ఆనంద భాష్పాలు అంటూ బ్రహ్మీ వేసిన ఒక స్కెచ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాముడు ఆంజనేయుడిని గుండెలకు హత్తుకుంటున్న ఉన్న ఈ ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే బ్రహ్మానందంలో అద్భుతమైన చిత్రకళ దాగి ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు.
Another lovely pencil sketch by Hasya Brahma #Brahmanandam #TheArtandTheArtist pic.twitter.com/kpsB5ot1RF
— Shreyas Group (@shreyasgroup) August 5, 2020
ఇకపోతే దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక ట్రాజెడీ రోల్ లో నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు కీలకమైనది. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్ గా తెలుస్తుంది. ఈ రీమేక్ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. రెడ్‌బల్బ్ మూవీస్, హౌస్‌ఫుల్ మూవీస్, ఎస్వీఆర్ గ్రూప్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.