వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా మరో విజయం సాధించే దిశగా ముందుకు వెళుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్ లలో స్వల్ప స్కోర్ 256 మాత్రమే చేయగలిగింది. ఈ స్కోర్ వరుస విజయాలతో ఊపుమీదున్న ఇండియాకు ఏమాత్రం సరిపోదు. అయినా తమ ప్రయత్నాలు చేస్తోంది. కాగా ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ మరియు గిల్ లు ఇండియాకు చక్కని శుభారంభాన్ని అందించారు, మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ అనవసర షాట్ కు ప్రయత్నించి 48 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ మరియు కోహ్లీ లు నెమ్మదిగా ఇండియాకు మరో విజయాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శుబ్మాన్ గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇది వరల్డ్ కప్ లో మొదటిది కావడం విశేషం.. జ్వరం కారణంగా మొదటి రెండు మ్యాచ్ లు ఆడలేకపోయిన గిల్ ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా మొదటి మ్యాచ్ ను ఆడాడు. గిల్ ఇప్పుడు 52 బంతుల్లో 50 పరుగులు చేశాడు.