చైనీస్ వ్యాక్సిన్ ట్రయల్స్ కి బ్రెజిల్ బ్రేక్..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఇక అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశ శాస్త్రవేత్తలందరు ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికి కొన్ని వ్యాక్సిన్ తయారు చేసిన ఇంకా అవి ట్రయలస్ దశలోనే ఉన్నాయి. ఇక చైనా కూడా కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ని కనిపెట్టింది.

vaccine
vaccine

చైనాకు చెందిన ‘సినోవాక్‌ బయోటెక్’ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కరోనా వ్యాక్’పై బ్రెజిల్‌లోని ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రం ‘సావో పాలో బుటాంటన్‌ ఇనిస్టిట్యూట్’ క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది. ఈ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. బ్రెజిల్‌లో చివరి దశకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలను తెలిపింది. టీకా ప్రయోగాలు ఈ దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా ‘సినోవాక్‌’ నిలిచింది. ఇక చైనీస్ వ్యాక్సీన్ ‘కరోనా వ్యాక్ ‘ క్లినికల్ ట్రయల్స్ ని బ్రెజిల్ నిలిపివేసింది.

ఈ వ్యాక్సీన్ తీసుకున్న వాలంటీర్లలో ఒకరరు గత నెల 29 న ఏదో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ ‘ అన్ విసా ‘ తెలిపింది. అతని ఆరోగ్యం ఎలా క్షీణించిందో తెలియడంలేదని ఈ సంస్థ పేర్కొంది. బహుశా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉండవచ్చునన్నారు. లేక ఇంకేదో సీరియస్ ప్రాబ్లం అయి ఉండవచ్చు.. ఏ విషయం ప్రైవసీ కారణంగా చెప్పలేం అని అన్ విసా ప్రకటించింది. చాలా అడ్వాన్స్ దశలో ఉన్న వాలంటీర్లలో ఒకరికి ఇలా కొత్త సమస్య తలెత్తడంతో బ్రెజిల్ లో చైనీస్ వ్యాక్సీన్ కి బ్రేక్ పడింది. అసలైన కారణాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఈ హెల్త్ రెగ్యులేటరీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news