ఇటీవలే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి పంపించడం జనాలు అందరిని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేసింది. ఒకసారి కాకుండా వరుసగా పలుమార్లు తెల్లవారుజామున భూమి కనిపించడంతో గాఢనిద్రలో ఉన్న జనాలు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భయంతో బయటికి పరుగులు తీశారు. ఇప్పటికే వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాసులందరూ ఇక ఇప్పుడు తెల్లవారుజామున ఊహించని విధంగా భూమి కనిపించడంతో తీవ్ర భయాందోళన లో మునిగిపోయారు.
దాదాపు తెల్లవారుజామున మూడు సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఎంతో భారీగా శబ్దాలు వచ్చాయని దీంతో ప్రజలందరూ భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారని అధికారులు చెబుతున్నారు. వనస్థలిపురం బి.ఎన్.రెడ్డి నగర్ వైదేహి నగర్ లలో తెల్లవారుజామున ఐదున్నర గంటలకు… ఉదయం 6:45 గంటలకు.. మళ్లీ ఆ తర్వాత 7.8 గంటలకు కూడా మూడుసార్లు భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ భూ ప్రకంపనలు తీవ్రత రిక్టర్ స్కేల్ పై 0.5 గా నమోదు అయిందని అధికారులు తెలిపారు.