ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ ఎంపికను పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజుని నియమించారు. ఈ రోజు ఉదయం ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పదవీ కాలాన్ని మూడేళ్ళకు తగ్గిస్తూ ఆర్డినెన్స్ ని తీసుకు వచ్చిన నేపధ్యంలో రమేష్ కుమార్ పదవి కాలం పూర్తి అయింది.
ఈ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్దం అని విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఈ నిర్ణయం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని రమేష్ కుమార్ ని అన్యాయం గా తొలగించారు అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు అయితే ఈ ఆరోపణలు చేస్తూనే రాష్ట్ర గవర్నర్ కి లేఖలు కూడా రాసారు. అటు బిజెపి కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయింది.
ముందు ఈ పదవి కోసం ముగ్గురు పేర్లను పరిశీలించగా… వారిలో ఎవరూ రిటైర్ అయిన న్యాయమూర్తులు లేరు. దీనితో వారిని కాదని కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమించారు. కొత్త కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు పేరును ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం… గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదానికి దస్త్రం పంపింది. గవర్నర్ దీనిని ఆమోదించారు.