కరోనా విలయతాండవానికి ఇప్పటికే పలు ఆలయాలు మూత పడ్డాయి. మరికొన్ని ఆలయాల్లో ముఖ్యమైన సేవా కార్యక్రమాలు రద్దు చేశారు. ఇక ఇదే దారిలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయం చేరింది. ఈ ఆలయంలో కోడె మొక్కులు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు.
కరోనా కేసులు వేములవాడలో పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇప్పటికే వేములవాడలో స్వచ్ఛంద లాక్‌డౌన్ కూడా అమలులో ఉంది. అయితే ఇతర దర్శనాలు మాత్రం జరుగుతాయని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఈవో కోరారు. దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కోడె మొక్కులు ఉండవని తెలిపారు.