దేశంలో కరోనా మూడో వేవ్ ఉంటుందనే వార్తలు వస్తుండటంతో.. సుప్రీంకోర్టు అలర్ట్ అయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఇప్పటి వరకు ఉన్న కరోనా ప్రణాళికను మార్చాలని కోరింది. ఈ ప్రణాళిక పూర్తి స్థాయిలో ఫలితం తీసుకురావట్లేదని అభిప్రాయపడింది.
ఇక మూడో వేవ్ వస్తుందని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వలతో దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఢిల్లీకి అవసరమైన 700టన్నుల ఆక్సిజన్ అందించాలని తెలిపింది. ఇక ప్రభుత్వం తరఫున వాదించిన తుషార్ మెహతా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. అవసరమైతే మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకుంటుందని చెప్పింది. ఇక కోర్టు స్పందిస్తూ.. ఆక్సిజన్ నిలువలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించింది.