రేపే ఉప ఎన్నిక..క్లీన్ స్వీప్ పై బీజేపీ,టీఎంసీ గురి

-

పశ్చిమ బెంగాల్‌లోని 4 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వైరం విపరీతస్థాయిలో ఉండగా, ఈ ఉప ఎన్నికతో చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొంది.

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేయగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలను పంపించింది. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో సీట్లు తగ్గిన కారణంగా నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధిక్యాన్ని ఉపయోగించి విజయాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా ఉంది.బుధవారం మానిక్తలా, రణఘాట్ దక్షిణ్,రాయ్‌గంజ్, బాగ్దా అసెంబీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది.ఉప ఎన్నికలు జరిగే 4 చోట్ల 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే, వారు తర్వాత అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. మానిక్తలా నియోజకవర్గం టీఎంసీ నేత సాధన్ పాండే మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 10 లక్షల మంది ఓటర్లు ఉండగా,ఎన్నికల కౌంటింగ్ జూలై 13న జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news