గత కొన్ని సంవత్సరాలకు ముందు కేవలం దీపావళి పండుగ సమయంలో మాత్రమే బాణసంచాను కాల్చేవారు. కానీ నేటి రోజుల్లో ఏ శుభకార్యం లేదా చెడు కార్యం అయినా బాణాసంచాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీని తయారీకి అధిక సంఖ్యలో దేశవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. ఈ ఫ్యాక్టగారెలు ప్రమాదకరం కాబట్టి నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశించాయి. కాగా తాజాగా వెస్ట్ బెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లా ఏగ్రా లో ఒక విషాదం జరిగింది. ఖాధీకుల్ గ్రామంలోని బాణాసంచా పరిశ్రమలో ప్రమాదం జరిగింది.
బాణాసంచా తయారుచేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు మృతి చెందారు, ఇంకా కొందరికి తీవ్రంగా గాయాలయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్నది సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.