ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8కు చేరిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయం అందుకున్న టీమిండియా నేడు కెనడాతో మ్యాచ్ ఆడనుంది. అయితే వర్షం కారణంగా ఇండియా ఆఖరి లీగ్ మ్యాచ్ ఒక్క బంతీ పడకుండానే రద్దైంది.
మ్యాచ్కు ముందు వర్షం పడగా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో టాస్ కూడా వేయలేకపోయారు.2 సార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్ ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గ్రూప్-ఏ నుంచి ఇండియాతో పాటు యూఎస్ఏ కూడా సూపర్-8కు అర్హత సాధించాయి.