ఫర్నిచర్ పై దుష్ప్రచారం సిగ్గుచేటు: వైసీపీ

-

వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ పై తెలుగుదేశం పార్టీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ మండిపడింది. ‘ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్కు డబ్బు చెల్లించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ వస్తువులకు ఖరీదుకట్టాలని వైసీపీ కార్యాలయ సిబ్బంది 9-10 రోజుల క్రితమే అధికారులను కోరారు. ప్రస్తుతం ఆ ఫైలు అధికారిక ప్రక్రియలో ఉంది. ఇదిలా ఉండగానే టీడీపీ, మంత్రులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు’ అంటూ ట్వీట్ చేసింది.

కాగా, ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ఫర్నిచర్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంట్లో ఉందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఎక్స్(ట్విట్టర్)లో ఆరోపణలు చేసింది. ‘లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా వైఎస్ జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు అని ,అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్తో నింపేసాడు అని, పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు. ఫర్నిచర్ దొంగ జగన్’ అని ఓ ఫొటోను పంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news