తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఛీ కొట్టి ఓడించినా కేసీఆర్ లో అహంకారం తగ్గలేదు : బండి సంజయ్

-

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా మాజీ సీఎం కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.హైదరాబాద్ లో శనివారం బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. “సీఎంగా పనిచేసిన కేసీఆర్ కి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్దంగా నియమించిన కమిషన్ కు కనీస గౌరవం ఇవ్వాలనే ఇంగిత జ్నానం లేకపోవడం సిగ్గు చేటు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై విచారణ చేస్తున్న తరుణంలో చీఫ్ జస్టిస్ గా పనిచేసిన నర్సింహారెడ్డి నోటీసులు జారీ చేస్తే.. వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఛీ కొట్టి ఓడించినా కేసీఆర్ లో అహంకారం తగ్గలేదు అని అన్నారు.

జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కేసీఆర్ వాదనలో పస ఉంటే న్యాయస్థానానికి ఎందుకు వెళ్లలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news