గత కొన్నాళ్ళుగా చైనా, భారత్ వర్సెస్ పాకిస్తాన్ గా పరిస్థితి మారింది. చైనా గల్వాన్ లోయ వద్ద వ్యవహరిస్తున్న దూకుడుతో పాటుగా పాకిస్తాన్ తన సైన్యం ద్వారా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతుంది. దీనిపై ఆందోళన ఉంది కూడా. భారత్ చైనా పాక్ విషయంలో కఠిన వైఖరి తో ఉంది. ఎప్పటికప్పుడు సమాధానం కూడా ఇచ్చేస్తుంది. రెండు దేశాలతో సమదూరం పాటిస్తుంది.
తాజాగా మరొక నిర్ణయం తీసుకుంది ఇండియా. చైనా & పాకిస్తాన్తో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. చైనా మరియు పాకిస్తాన్ దళాలు కూడా పాల్గొంటున్న మల్టీ నేషనల్ సైనిక కవాతు… కవ్కాజ్ -2020 లో తమ దళాలు పాల్గొనబోవని భారతదేశం రష్యాకు చెప్పే అవకాశం ఉంది అని జాతీయ మీడియా వ్యాఖ్యానించింది.