తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. తమిళిసై బాబాయి, కాంగ్రెస్ ఎంపీ వసంత్ కుమార్ మృతి చెందడంతో కేసీఆర్ ఆమెను పరామర్శించారు. కరోనాతో వసంత్‌కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 70ఏళ్ల వసంత్ కుమార్ ఈనెల 10న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా… చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఎంపీ వసంత్ కుమార్ మరణంతో తమిళి సై ఇంట విషాద ఛాయలు అలుముకోవడంతో… రాజ్‌భవన్‌లో గవర్నర్‌న కలిసి కేసీఆర్ పరామర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా గవర్నర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అలాగే తనను పరామర్శించడానికి వచ్చిన కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, కరోనాపై కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
Thank you honb CM KCR garu for visiting #rajbhavan Hyderabad and sharing the grief and offering the condolences on the demise of my uncle Shri H.vasanthakumar MP kanyakumari TamilNadu @TelanganaCMO @PIBHyderabad pic.twitter.com/vPdOrO1qI8
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 29, 2020