కాస్ట్‌లీ బైక్.. కస్టమ్ ఫైర్..!

-

నచ్చిన బైక్‌పై షికారుకు వెళ్లాలంటే అందరికీ మహా సరదా. ధనికులైతే ఎంత డబ్బైనా ఖర్చు చేసి మరి వేరే దేశాల నుంచి బైక్‌లను ఇండియాకు తీసుకొస్తుంటారు. మంచి బైక్‌పై రైడ్‌కి వెళ్లాలనేది చాలా మందికి ఉంటే ఆశ. దానికోసం ఎంత దూరమైన వెళ్తారు. ప్రతి చిన్న అవసరానికి బైక్‌ను వాడేస్తుంటారు. అలా ఓ వ్యక్తి కూరగాయలు, ఇంటి సామగ్రి కొనుగోలు చేయడానికి మార్కెట్‌కు వెళ్లాడు. అయితే ఆ బైక్‌ను చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఆ బైక్ ధర రూ.75 లక్షలు. ఇంత కాస్ట్‌లీ బైక్ పక్కనే నిలబడితే ఎవరు మాత్రం ఉరుకుంటారు. ఫోటోలు సెల్పీలు తీసేందుకు ఎగబడ్డారు.

హోండా బైక్
హోండా బైక్

బైక్‌ను రోడ్డు పక్కనే ఆపి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్లాడు యజమాని. కూరగాయలు కొనుక్కొని బైక్ డిక్కి తెరిచి కూరగాయలు అందులో పెడుతుండగా మరో వ్యక్తి వీడియోను తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా కస్టమ్స్ అధికారులు బైక్‌ను సీజ్ చేయాల్సి వచ్చింది. ఏడాది తర్వాత రూ.24 లక్షలు పెనాల్టీ చెల్లించి బైక్ సొంతం చేసుకున్నాడు యజమాని. ఎన్ఆర్ఐ అయిన బాబు జాన్.. హోండా గోల్డ్ వింగ్ ట్రైక్ యూనిక్ బైక్‌ను యూఏఈ దేశం నుంచి దిగుమతి చేసుకున్నాడు. బైక్‌ను ఇంటికి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లిందంటే నమ్మరు.

ఈ బైక్ 1832 సీసీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో ఆరు సిలిండర్ ఇంజిన్‌లు ఉంటాయి. గరిష్టంగా 118 బీహెచ్‌పీ వేగంతో వెళ్లగలదు. ఇందులో రివర్స్ గేర్ సౌకర్యం కూడా ఉంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 55 లీటర్లు ఉంటుంది. నగరంలో లగ్జరీ బైక్స్‌ హవా నడుస్తోంది. కొంతమంది స్టేటస్‌ కోసం.. మరికొందరు లుక్‌ నచ్చడంతో ఖరీదు ఎంతైనా పట్టించుకోకుండా కొనేస్తున్నారు. బైక్‌ కొన్నామా.. రయ్‌ రయ్ మంటూ దూసుకుపోయామా అన్నట్లుగా కుర్రకారు వ్యవహరిస్తోంది. దీనికోసం మార్కెట్‌లోకి ఏదైనా లేటెస్ట్‌ బైక్‌ వస్తే చాలు కొనేస్తున్నారు. యువకుల ఆసక్తికి అనుగుణంగా కొన్ని కంపెనీలు బైక్స్‌ని పలు రకాలు డిజైన్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్‌, యమహా, హార్లీడేవిడ్సన్‌, కేటీఎం, బెనేల్లి, సుజుకీ తదితర కంపెనీల మోడల్స్‌కు విపరీతమైన క్రేజ్‌ పెరిగిందనే చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news