బ్రేకింగ్; ప్రత్యేక విమానంలో కొరియా నుంచి ఏపీకి లక్ష కరోనా టెస్ట్ కిట్లు…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పై యుద్దాన్ని వేగవంతం చేసింది. పరిక్షలు ఎక్కువగా నిర్వహిస్తే కరోనా అంత త్వరగా కట్టడి అవుతుంది అని భావించిన ఏపీ సర్కార్… ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ని ఎక్కువగా అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తుంది. విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్స్ తయారిని వేగవంతం చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ రోజుకి దాదాపు వెయ్యి కిట్స్ వరకు తయారు చేస్తున్నారు.

అయినా సరే కిట్స్ సరిపోకపోవడంతో ఏపీ సర్కార్… ఇతర దేశాల నుంచి కిట్స్ ని దిగుమతి చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ని దిగుమతి చేసుకున్నారు. లక్ష కిట్స్ ని ఏపీ సర్కార్ దిగుమతి చేసుకుంది. ప్రత్యేక విమానంలో దక్షిణ కొరియా నుంచి తరలించారు. వీటిని తాడేపల్లి సిఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్ ప్రారంభించారు.

ఈ టెస్ట్ కిట్స్ కేవలం పది నిమిషాల్లో కరోనా పరీక్షను నిర్వహిస్తాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కిట్స్ 55 నిమిషాలు కొన్ని మరికొన్ని 7 గంటలకు పరిక్షా ఫలితాలను ఇస్తున్నాయి. దీనితో ఏపీ సర్కార్ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వీటిని దిగుమతి చేసుకుంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 572 కేసులు నమోదు అయ్యాయి. నేడు 38 కేసులు నమోదు కాగా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news