ప్రపంచ కుబేరుల్లో ఒకడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో పూర్తిగా డోనాల్డ్ ట్రంప్ విఫలమైనట్లు బిల్ గేట్స్ బలంగా నమ్ముతున్నాడు. అమెరికాలో ట్రంప్ వ్యవహరించిన తీరు వల్ల లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు.ఈ విధంగా డోనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయి తన తప్పుని పక్కదోవ పట్టిస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పై విమర్శలు చేయడాన్ని బిల్ గేట్స్ ఖండించారు. అంతేకాకుండా ఇటువంటి క్లిష్ట సమయంలో ‘WHO’ కి నిధులు ఆపేయటం సమంజసం కాదని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను అన్నిటినీ ఒకతాటిపైకి తీసుకువస్తూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందునుండి కరోనా వైరస్ పై గట్టిగా పోరాడుతుందని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
ఇటువంటి టైములో ‘WHO’ కి వ్యతిరేకంగా అమెరికా దేశాన్ని ట్రంప్ నడిపించడం వల్ల…భవిష్యత్తులో అమెరికా ఏకాకి దేశం అయిపోయే అవకాశం ఉందని అన్నట్టుగా పేర్కొన్నారు. వెంటనే ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి యధావిధిగా నిధులు రిలీజ్ చేయాలని కోరారు. దీంతో బిల్ గేట్స్ ఇచ్చిన సూచనల పట్ల అమెరికన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రపంచంలో అమెరికా దేశం ఏకాకిగా మిగలకుండా డోనాల్డ్ ట్రంప్…బిల్ గేట్స్ సూచనలను పరిగణలోకి తీసుకుంటారో, లేదో చూడాలి.