బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్ 2024 కు దూరమైన కీ ప్లేయర్… !

-

గత కొన్ని సీజన్ లుగా ఇంగ్లాండ్ కు చెందిన స్పీడ్ బౌలర్ జొఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్ కు చాలా కీలకమైన బౌలర్ గా ఉంటూ వచ్చాడు, ఎన్నో మ్యాచ్ లను గెలవడంతో తన వంతు కీలక పాత్రను పోషించాడు. అయితే కొంతకాలంగా గాయాల కారణంగా గత ఐపీఎల్ సైతం ఆడలేక ముంబై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.. అందుకే ఐపీఎల్ సీజన్ 2024 కు ముందు ముంబై యాజమాన్యం అతనిని వేలానికి వదిలేసి భారీ షాక్ ఇచ్చింది. కానీ అతను వేలంలో పాల్గొంటే తనకు ఎన్ని కోట్లు అయినా పెట్టి కొనుక్కునేందుకు జట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే జొఫ్రా ఆర్చర్ ఈ ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ లో లేకపోవడంతో చాలా మంది అభిమానులు బాధపడ్డారు.

కొన్ని కారణాల వలన ఆర్చర్ ఈ ఐపీఎల్ కు అందుబాటులో ఉండకపోవడంతోనే అతను తన పేరును నమోదు చేసుకోలేదని తెలుస్తోంది. దీనితో ఐపీఎల్ ఒక స్టార్ బౌలర్ ను చూడలేకపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news