IPL 2024 AUCTION: 1166 ప్లేయర్స్ పేర్లు నమోదు …!

-

రానున్న సంవత్సరం జరగనున్న ఐపీఎల్ కోసం ఇప్పటి నుండి ఫ్రాంచైజీలు జట్టులో ఆటగాళ్లను సంసిద్ధం చేస్తున్నాయి. ఇక డిసెంబర్ 19 న దుబాయ్ లో జరగనున్న ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. మాములుగా ఇది ఐపీఎల్ మినీ వేలం అనుకున్నా, ఇది మెగా వేలాన్ని తలపిస్తోంది. ఈ డ్రాఫ్ట్ లో మిచెల్ స్తర్క్, పాట్ కమిన్స్, హెడ్, మిచెల్ మరియు రవీంద్ర లాంటి వరల్డ్ కప్ స్టార్స్ ఉండడమే విశేషం అని చెప్పాలి. ఈ మొత్తం ఆటగాళ్లలో ఇండియా నుండి 830 మంది ప్లేయర్స్ ఉండగా, ఓవర్సీస్ నుండి 336 మంది ఉన్నారు. ఐపీఎల్ జట్లు చాలా మంది కీలక ప్లేయర్స్ ను ఈ వేలానికి వదిలేయడంతో ఎవరు ఎవరిని దక్కించుకుంటారన్న ఆసక్తి ప్రేక్షకులలో ఉంది.

ఇక గత సంవత్సరం కెప్టెన్ ధోని సక్సెస్ ఫుల్ గా నడిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా విజయం సాధించి టైటిల్ దక్కించుకోగా, వచ్చే సీజన్ లో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news