ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం… బౌలర్లు అద్బుతం చేస్తారా ??

-

ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్యన జరుగుతున్న నాలుగవ టీ20 మ్యాచ్ చాలా పేలవంగా సాగుతోంది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్ లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 174 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్ గైక్వాడ్ లు మొదటి వికెట్ కు మంచి భాగస్వామ్యమే ఇచ్చినా, దీనిని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక ప్లేయర్లు ఫెయిల్ అయ్యారు, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ 8, సూర్య కుమార్ యాదవ్ 1 లు కీలక సమయంలో అవుట్ అయ్యి ఇండియాకు మంచి స్కోర్ అందించే అవకాశాన్ని పోగొట్టారు. ఆ తర్వాత రింకు సింగ్ (46) మరియు జితేష్ శర్మ (35) లు ఆకట్టుకునే ఇన్నింగ్స్ లు ఆడడంతో ఇండియా ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది. ముఖ్యంగా జితేష్ శర్మ వచ్చిన అవకాశాన్ని మంచిగా వాడుకున్నాడు.

ఇప్పడు ఆస్ట్రేలియా ముంగిట 175 పరుగులు లక్ష్యమే నిలిచింది, బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉన్న ఆస్ట్రేలియా కు ఈ స్కోర్ సరిపోతుందా ? లేదా ఇండియా బౌలింగ్ అద్భుతం చేసి ఇండియాను గెలిపించగలదా అన్నది తెలియాలంటే కాసేపు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Latest news