2020 లో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక మరియు జొన్నలగడ్డ చైతన్య తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలం వరకు ఎంతో అన్యోన్యంగా జీవించారు.. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం నుండి ఇద్దరూ ఎవరికి వారే విడిగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య కొన్ని విషయాలలో సరైన అవగాహన లేకపోవడం వలన ఏర్పడిన గొడవలు వీరిని దూరంగా ఉంచాయి. అప్పటి నుండి అదిగో విడాకులు.. ఇదిగో విడాకులు అంటూ వార్తలు హల్ చల్ చేస్తూ వచ్చాయి. కానీ ఇంతకాలం తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని పరప్సర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగా మే 19 న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు లో విడాకుల కోసం పిటిషన్ పెట్టుకున్నారు.
ఈ విడాకులపై త్వరలోనే కోర్ట్ తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇది తెలిసిన మెగా అభిమానులు చాలా బాధలో ఉన్నారు.