సంచలనం: పరీక్ష పేపర్ లీకేజ్ లో తప్పు రుజువయితే “జీవిత ఖైదు”…

-

కొంతకాలం క్రితం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కు సంబంధించి పరీక్ష పత్రాలు లీక్ అయిన విషయం ఎంతటి సంచలనంగా మారిందో చూశాము. తాజా తెలుస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్ లోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మీడియా ముఖంగా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పరీక్షల పేపర్ లీకేజీ లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కటినమైన నిర్ణయం దిశగా ముందుకు వెళుతున్నామని అశోక్ గెహ్లాట్ చెప్పారు. ఈ కేసులో ఎవరికి అయినా ప్రమేయం ఉందని తెలిస్తే వారికి జీవిత ఖైదు విధించే ఒక బిల్లును త్వరలోనే తీసుకువస్తాం అన్నారు సీఎం గెహ్లాట్.

అప్పటి వరకు ఈ కేసులలో దోషులుగా ఉన్న వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడనుంది. మరి వార్తను చూసిన ఎవరైనా మళ్లీ ఈ తప్పును చేయడానికి భయపడేలా ఈ చట్టం ఉంది. కాగా ఈ చట్టాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు ఏమైనా మారుతాయా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news