రఘునందన్‌రావు దారెటు.. వ‌కీల్‌సాబ్‌కు చిక్కుముడి

-

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేరనేది తెలిసిందే. పైగా ఇటీవల ఆయన చిట్‌చాట్‌లో హాట్‌హాట్‌ గా చేసిన కామెంట్స్‌ బీజేపీలో ప్రకంపనలు సృష్టించాయి. తీరా ఆ మాటలు అగ్గి రాజేయడంతో తానే మళ్ళీ మీడియా ముందుకొచ్చి తాను మంచి బాలుడిని అని చెప్పుకోవలసి వచ్చింది.పదవులు పొందేందుకు నాకే తక్కువ అని వ్యాఖ్యానించిన రఘునందన్‌రావు పదవులు ఆశించడంలో ఎలాంటి తప్పులేదన్నారు. అయితే ఫైనల్‌గా అధిష్టానం నిర్ణయానికే కట్టుబుడి ఉంటాననే సంకేతాలు ఇచ్చారు.

రఘునందన్‌రావు
రఘునందన్‌రావు

తెలంగాణలో బీజేపీలో ఈటెల, బండి వర్గాలుగా పార్టీ లీడర్లు విడిపోయిన నేపథ్యంలో.. రఘునందన్‌ కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లడం, పదవుల విషయంపై పెద్దలతో మాట్లాడాలని భావించడంతో ఏదో జరుగుతోందని అంతా భావించారు. పార్టీ అధ్యక్ష పదవి లేదా అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అదీ కాకుంటే జాతీయ అధికార ప్రతినిధిగా తనను గుర్తించాలని రఘునందన్‌ ప్రపోజల్‌ పెట్టినట్టు సమాచారం. 10 ఏళ్లుగా పార్టీకోసం సిన్సియర్‌గా పనిచేస్తున్నందున పదవులకు తానెందుకు అర్హుడిని కాదని ప్రశ్నిస్తూ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. అయితే దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

అంతేకాదు దుబ్బాక ఎన్నికలో తనకు ఎవరూ సపోర్ట్‌ చెయ్యలేదని చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు రఘునందన్ రావు. అయితే మునుగోడులో 100 కోట్లు ఖర్చుపెట్టినా గెలవలేదని ఆయన గుర్తు చేశారు. అదే 100 కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. సరదాగా మాట్లాడిన విషయాలను.. తప్పుగా అర్థం చేసుకొని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ప్రచారం జరిగిందని.. తాను క్రమశిక్షణకలిగిన కార్యకర్తననీ అన్నారు. తాను కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పిన రఘునందన్‌ కేవలం నియోజకవర్గం సమస్యలపై మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి 120 కోట్లతో దుబ్బాక నియోజకవర్గంలో సెంట్రల్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద నిధులు ఇవ్వాలని కోరానన్నారు.ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన పార్టీ మారతారనే న్యూస్‌ కూడా రన్‌ అవుతోంది. అయితే ఇప్పుడిప్పుడే తెలంగాణలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న హైకమాండ్‌ రఘునందన్‌రావు ఇష్యూపైన కూడా దృస్టిపెట్టినట్లు సమాచారం.మరి రఘునందన్‌రావు ఆశిస్తున్నట్లు ఏదైనా పదవి ఆయనకు వచ్చే అవకాశం ఉందా లేక చిట్‌చాట్‌లో కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకుని కొరడా జులిపిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news