నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలుపై ఎట్టకేలకు ఉత్కంట తొలగింది. వారిని ఉరి తీయడానికి పాటియాలా హౌస్ కోర్ట్ డెత్ వారెంట్ ఇవ్వగా మార్చ్ మూడున ఉరి తీయవద్దు అంటూ పవన్ గుప్తా అనే నిందితుడు పాటియాలా హౌస్ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసాడు. ఈ పిటీషన్ ని న్యాయస్థానం కొట్టేసింది. ఇక సుప్రీం కోర్ట్ లో క్యురేటివ్ పిటీషన్ దాఖలు చేయగా అది కూడా కోర్ట్ కొట్టేసింది.
దీనితో ఉరి శిక్ష అమలుకి దాదాపుగా అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. రాష్ట్రపతి వద్ద పవన్ గుప్తా పిటీషన్ పెండింగ్ లో ఉంది. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. దీనితో ఆ ఒక్కటి రాష్ట్రపతి తిరస్కరిస్తే అమలుకి ఇంకా ఏ అడ్డంకులు ఉండవు. ఇప్పటికే ముగ్గురు దోషులకు న్యాయ రాజ్యాంగ పరంగా ఉన్న అన్ని అవకాశాలు పూర్తి అయ్యాయి. మిగిలిన ఒక్కరికి కేవలం ఒకే ఒక్క అవకాశం ఉంది.
దీనితో ఉరి శిక్షను రేపు తీహార్ జైల్లో అమలు చేయనున్నారు అధికారులు. ఒకవేళ రాష్ట్రపతి తిరస్కరించినా సరే 14 రోజుల్లో వారిని ఉరి తీయడం ఖాయం. అన్ని అవకాశాలు పూర్తి అయ్యాయి కాబట్టి అటు నిర్భయ తల్లి కూడా హర్షం వ్యక్తం చేసారు. రేపు ఉరి శిక్ష అమలు జరుగుతుందని తాము నమ్ముతున్నట్టు చెప్పారు. ఇప్పటికే తీహార్ జైల్లో అన్ని సిద్దంగా ఉన్నాయి. పవన్ జలాద్ అనే తలారి వారిని ఉరి తీయనున్నాడు.