బ్రేకింగ్; ఏపీలో ఆర్టీసి చార్జీల పెంపు…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి చార్జీలను పెంచే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల డీజిల్ ధరలు పెరిగాయి. అంటే లీటర్ కి దాదాపు రెండు రూపాయల వరకు భారం పెరుగుతుంది. ఇప్పటికే సంస్థ నష్టాల్లో ఉంది. ఇప్పుడు ఈ భారం అదనంగా పడితే సంస్థ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక్కో రీజియన్ కి ఏడాదికి 4 కోట్లు భారం పడుతుంది.

ఒక్క నెల్లూరు రీజియన్ పరిధిలోనే 18 లక్షల భారం నెలకు పడుతుంది. నెల్లూరు ఆర్టీసీ రీజియన్‌లో పది ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో 750కు పైగా బస్సులు రోజూ విధులు నిర్వహిస్తున్నాయి. పది డిపోల పరిధిలో 56వేల లీటర్ల డీజిల్ ని వినియోగిస్తున్నారు. నెలకు 16,80,000ల లీటర్ల డీజల్‌ ఖర్చవుతోంది. ప్రస్తుతం లీటర్‌ డీజల్‌పై రూ.1.07లు ధర పెరగడంతో నెల్లూరు రీజియన్‌పై నెలకు రూ.18లక్షలకు పైగా భారం పడే అవకాశం ఉంది.

ఈ పరిస్థితి అన్ని జిల్లాలలోను పడుతుంది కాబట్టి ధరలు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆర్టీసి చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పుడు మళ్ళీ పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు ఈ ధరలు కూడా పెంచితే విపక్షాలు మరోసారి తీవ్ర ఆందోళనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news