ఈ మధ్యన చూస్తే దేశవ్యాప్తంగా చాలా చోట్ల అగ్నిప్రమాదములు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని అరియలూర్ జిల్లాలో పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనకు ఉన్న సమాచారం ప్రకారం ఆ ప్రమాదం వలన 9 మంది మరణించారు. అక్కడి వారు చెబుతున్న ప్రకారం ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్సెస్ ఉన్నాయట. బాణాసంచా గో డౌన్ లో చాలా కాలంగా నిల్వ ఉన్న కారణంగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షలు, తీవ్రంగా గాయాలు పాలైన వారికి రూ. లక్ష మరియు స్వల్ప గాయాలు అయిన వారికి రూ. 50 వేలు నష్టపరిహారంగా అందిస్తామని ప్రకటించడం జరిగింది. మరి ఈ ఘటనలో గాయాలతో కొట్టు మిట్టాడుతున్నవారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
ప్రభుత్వాలు ఇటువంటి బాణాసంచా గో డౌన్ ల విషయంలో చర్యలు తీసుకుంటే ముందు ముందు ఎన్నో ప్రమాదాలను అడ్డుకునే అవకాశం ఉంటుంది.